దేశ విద్యా రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం-2020ను తీసుకొచ్చింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడానికి, మనోవికాసం వృద్ధి చెందడానికి స్కూల్ స్థాయి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అనేక విప్లవాత్మక మార్పులకు ఈ విధానం నాంది పలుకుతోంది. అందులో భాగంగా ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ పది, 12 తరగతుల పరీక్ష విధానంలో మార్పులు తీసుకువచ్చారు. అలాగే ఏడాదికి రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని గతంలో కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు రెండుసార్లు జరిగే బోర్డు పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరి కాదని, పూర్తిగా ఐచ్చికమని కేంద్ర విద్యాశాఖ మంత్రి తాజాగా చెప్పారు. సీబీఎస్‌ఈ బోర్డ్ 10, 12 తరగతుల పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహణ అనేది 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు రెండుసార్లు జరిగే బోర్డ్ పరీక్షలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి అవసరం ఉండదు. ఇది పూర్తిగా ఆప్షనల్. విద్యార్థులు రెండుసార్లు లేదా ఒకసారి మాత్రమే హాజరుకావచ్చు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు, ఎక్కువ స్కోర్ సాధించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ కాన్సెప్ట్‌ను తీసుకొస్తోంది. ఏ విద్యార్థి అయినా మొదటి సెట్ పరీక్షల్లో వచ్చిన స్కోర్‌తో సంతృప్తి చెందితే, తదుపరి పరీక్షలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. పీటీఐతో కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడుతూ.. 'ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్(జేఈఈ) మాదిరిగానే విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకావచ్చు. వీటిల్లో వచ్చిన ఉత్తమ మార్కులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. రెండుసార్లు పరీక్షలు రాయడం అనేది పూర్తిగా ఐచ్ఛికం. విద్యార్థులు ఒకసారి లేదా రెండోసారి పరీక్షలు రాయవచ్చు. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఈ విధానం 2024 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.' అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. కేంద్ర విద్యాశాఖ కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. పది, 12 తరగతుల విద్యార్థులు ఒక లాంగ్వేజ్‌కు బదులుగా రెండు లాంగ్వేజ్‌లను ఇకపై అభ్యసించాల్సి ఉంటుంది. 'విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం, అవకాశం కల్పించేందుకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డ్ పరీక్షల నిర్వహణ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నాం. ఈ పద్దతి ద్వారా విద్యార్థులు బోర్డ్ పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతారు. తద్వారా పరీక్షల్లో బెస్ట్ స్కోర్ సాధించడానికి వీలు ఉంటుంది.' అని నేషనల్ కరిక్యూలమ్ ఫ్రేమ్‌వర్క్ పేర్కొంది.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో కీలక మార్పు!
October 09, 2023
0
Tags