అమర్త్యసేన్‌ క్షేమంగానే ఉన్నారు !

Telugu Lo Computer
0


ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు. అమర్త్యసేన్‌ కన్నుమూశారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతులను ఆయన కుమార్తె నందనా సేన్‌ ఖండించారు. తన తండ్రి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అమర్త్యసేన్‌ గురించి వదంతులు రాగానే తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె 'ఎక్స్‌' (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. తన తండ్రి అమర్త్యసేన్‌ గురించి వచ్చిన వార్తలు అవాస్తవమని నందనా సేన్‌ పేర్కొన్నారు. అమర్త్యసేన్‌ పూర్తిగా క్షేమంగా ఉన్నారన్నారు. తామంతా కేంబ్రిడ్జిలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపిన విషయాన్ని వెల్లడించారు. హార్వర్డ్‌లో వారంలో రెండు కోర్సులు బోధిస్తున్నారని.. అలాగే, ఓ పుస్తకం రాసే పనిలో నిమగ్నమై.. ఎప్పటిలాగే బిజీగా ఉన్నట్లు తెలుపుతూ నందన ఓ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. అమర్త్యసేన్‌ మృతి చెందినట్టు ఈ సాయంత్రం వచ్చిన వదంతులతో పలువురు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన పూర్తిగా క్షేమంగానే ఉన్నట్టు అమర్త్యసేన్‌ కుమార్తె స్పష్టత ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)