కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ మీద రాళ్లతో దాడి చెయ్యడానికి ప్రయత్నించిన ఘటన కోలార్ జిల్లా బేతమంగళలో చోటుచేసుకుంది. రోడ్డు వెడల్పు పనులు చేసే సమయంలో ఆక్రమణను తొలగిస్తుండగా ఓ వ్యక్తి కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ మీద రాళ్లతో దాడి చేశాడు. పోలీసుల సమయస్ఫూర్తితో కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళను ప్రమాదం నుంచి తప్పించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎమ్మెల్యే రూపకళకు పెనుప్రమాదం తప్పిందని, ఆమెను సురక్షితంగా రక్షించామని పోలీసు అధికారులు అంటున్నారు. రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కారణమైన రోడ్డును క్లియర్ చేసేందుకు ఎమ్మెల్యే రూపకళ శనివారం రంగంలోకి దిగారిని, అక్రమ కట్టడాలు తొలగిస్తున్న సమయంలో ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే, జేసీబీలపై రాళ్లు రువ్వాడని పోలీసులు అంటున్నారు. ఇప్పటికీ బేతమంగళ నుంచి వి. కోటకు వెళ్లే పాత మద్రాసు రోడ్డు గత కొన్నేళ్లుగా ఎలాంటి క్లియరింగ్ చేపట్టకుండానే శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఈరోజు ఎమ్మెల్యే రూపకళ ఆమె అక్కడే నిలబడి అక్రమ కట్టడాలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రూపకళ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టిన పీడబ్ల్యూడీ అధికారులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ సమక్షంలోనే తరలింపు కార్యక్రమం కొనసాగుతుండడంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాళ్లతో దాడికి యత్నించిన వ్యక్తిని బేతమంగళ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళపై రాళ్లతో దాడికి యత్నం !
October 14, 2023
0
Tags