కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన సోజన్ అనే వ్యక్తి తాను పనిచేసే చోట బండి పార్క్ చేసి ఉంచాడు. హెల్మెట్‌ను బైక్ ముందు భాగంలో ఉంచి వెళ్లాడు. అనంతరం పని ముగించుకొని సాయంత్రం బైక్ తీయబోయాడు. అయితే, అక్కడ హెల్మెట్‌ను పట్టుకోగా అందులో ఏదో కదులుతున్నట్లు అతడికి అనిపించింది. దీంతో అనుమానం వచ్చి చూడగా.. చిన్న కోబ్రా పిల్ల అందులో కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సోజన్.. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న లిజో అనే వ్యక్తి ఆ కోబ్రాను ఎంతో చాకచక్యంగా హెల్మెట్ నుంచి బయటకు తీశాడు. అనంతరం దాన్ని ఓ కవర్‌లో ఉంచి అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగానే పామును గమనించడంతో సోజన్ ప్రాణాలను దక్కించుకోగలిగాడు.
హెల్మెట్‌లో దూరిన పాము పిల్ల !
October 07, 2023
0
Tags