శరన్నవరాత్రి ఉత్సవాలకు యావద్దేశం సిద్దమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీరాసిన 'గర్బా' సాంగ్ శనివారం రిలీజైంది. స్వయంగా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ పాట విడుదలైన 9 గంటల్లో 1.9 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు పోతుండటం విశేషం. ఈ సందర్బంగా టీం మొత్తానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని ఈ పాటకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. చాలా యేళ్ల క్రితం రాసిన గర్బా సాంగ్ ఇది అని పేర్కొన్నారు. చాలా జ్ఞాపకాలను ఇది గుర్తు చేస్తోందన్నారు. కొన్ని సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేక పోయినప్పటికీ గత కొన్ని రోజులనుంచి ఈ కొత్త గర్బా పాట రాశానని, నవరాత్రి శుభ సందర్భంగా దీన్ని పంచుకుంటున్నా అంటూ మోడీ అన్నారు. ఈ గార్బో పాటను ధ్వని భానుశాలి ఆలపించగా, తనిష్క్ బాగ్చి స్వరపర్చారు. 190 సెకన్ల ఈ వీడియోను దసరా సందర్భంగా విడుదల చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నాని సొంత నిర్మాణ సంస్థ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై దీన్ని రూపొందించారు. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మోదీజీ ఈ పాట రాశారంటే నమ్మలేకపోతున్నాం. గొప్ప సాహిత్యం, మంచి సంగీతంతో చాలా మంచి పాట అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నవరాత్రికి ఈ పాట చరిత్ర సృష్టించబోతోంది. ఈ మాస్టర్ పీస్ గిఫ్ట్ ఇచ్చినందుకు లవ్ యూ మోదీ జీ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
మోడీ రచించిన 'గార్బా' మ్యూజిక్ వీడియో విడుదల !
October 14, 2023
0
Tags