ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బైక్ పై స్టంట్ !

Telugu Lo Computer
0

బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. కొంతమంది జనాలు తాము ఏదో సాధిద్దామనుకొని ఇతరులకు హాని కలిగేలా వ్యవహరిస్తారు. ఒక్కోసారి వారిని కొట్టేందుకు కూడా సిద్దపడతారు. రోడ్డు ఖాళీగా ఉన్నా.. బిజీగా ఉన్నా.. వారు బైక్ లపై చేసే విన్యాసాలు స్టంట్స్ మాత్రం ఆగవు. కొంతమంది చేసే మూర్ఖత్వపు పనులు చేసి వారి శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు అలానే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అయినా నేటి తరం యువతకు బైకులపై ఉండే క్రేజ్ అంతో ఇంతో కాదు. వారి చేతిలో బండి ఉంటే రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇదివరకు ఎన్నో చూసి ఉంటాం. కొంతమంది రీల్స్ కోసం బైక్ లపై ప్రయోగాలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా rahul_jat_bhdala ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)