ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

Telugu Lo Computer
0

ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధర టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. ఇది ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ధరల నియంత్రణతోపాటు దేశీయంగా ఉల్లిని అందుబాటును పెంచేందుకు ఈ నిర్ణయం తీసున్నట్లు తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)