అమిత్ షాని కలిసిన మంద కృష్ణ మాదిగ !

Telugu Lo Computer
0


ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కిషన్ రెడ్డితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాకు మంద కృష్ణ మాదిగ విజ్ణప్తి చేశారు. సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలన్న మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి అలంపూర్ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని మంద కృష్ణ మాదిగ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)