జీ20 పార్లమెంట్ స్పీకర్ల సమ్మిట్ కు కెనడా హాజరు కానున్నది. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఈ సదస్సుకు హాజరవుతామని ఆ దేశం స్పష్టం చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం తెలిపారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన ఆయన అక్టోబరు 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ (పీ20) జరుగుతుందని చెప్పారు. జీ20 కూటమి దేశాలను ఈ సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు. దీనికి హాజరవుతామని కెనడా సెనేట్ స్పీకర్ ధృవీకరించినట్లు వెల్లడించారు. కాగా, భారత్‌లో జరుగనున్న జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌కు పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ తొలిసారి హాజరవుతున్నదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయితే అంతర్గత కారణాల వల్ల జర్మనీ, అర్జెంటీనా ఈ సమ్మిట్‌కు హాజరుకావడం లేదని చెప్పారు. 'ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి' అన్న పేరుతో నిర్వహించే 9వ జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌లో పలు అంశాలపై చర్చ జరుగుతుందని వెల్లడించారు.
జీ20 పార్లమెంట్ స్పీకర్ల సమ్మిట్‌కు హాజరు కానున్న కెనడా !
October 06, 2023
0
Tags