17 మంది జడ్జిల నియామకం

Telugu Lo Computer
0

దేశ వ్యాప్తంగా పలు హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం, బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిలుగా నూనెపల్లి హరినాథ్‌, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌ లను నియమించారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ మున్నూరి లక్ష్మణ్‌ ను రాజస్థాన్‌ హైకోర్టుకు, జస్టిస్‌ జి.అనుపమ చక్రవర్తి ని పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు.  దేశవ్యాప్తంగా పలు హైకోర్టులకు 17మంది అదనపు న్యాయమూర్తులు, న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. అదే విధంగా పలు హైకోర్టుల్లో 16మంది జడ్జిలను వేరే హైకోర్టులకు బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)