ఐదు రోజులు వైన్స్‌ షాప్‌లు బంద్‌ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జీ20 సమావేశాలు, పండుగల నేపథ్యంలో ఐదు రోజుల పాటు వైన్స్‌ షాప్‌లు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, జీ20 సమావేశాల సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వైన్‌ షాపులను క్లోజ్‌ చేయనున్నారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 10 వరకు పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది. ఆ మూడు రోజులు మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ నెల 6, 7 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశించింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సెలవుల కారణంగా మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)