లష్కరే తోయిబా కమాండర్‌ ఉజ్జైర్ ఖాన్‌ హతం

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్‌ ఉజ్జైర్ ఖాన్‌ హతమయ్యాడు. ఈ మేరకు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌కు ముగింపు పలికినట్లు సైన్యం వెల్లడించింది. ఉజ్జైర్ ఖాన్ తో పాటు మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమయినట్లు ఏడీజీపీ పోలీసు వినయ్ కుమార్ తెలిపారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతనాగ్‌లో ఏడు రోజులుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగింది. అటవీ ప్రాంతాల్లో, కొండ చరియల్లో నక్కి ఉన్న టెర్రరిస్టుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)