కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి !

Telugu Lo Computer
0


కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో భారతీయ సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని ఇండియన్‌ కాన్సులేట్‌ తీవ్రంగా ఖండించింది. గత సోమవారం జరిగిన ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వరల్డ్‌ సిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెనడా నివేదిక ప్రకారం ఓ బస్ట్‌స్టాప్‌లో 17 ఏళ్ల సిక్కు విద్యార్థిపై స్థానిక విద్యార్థులు దాడి చేశారు. బస్సు ఎక్కే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. బస్సు ఎక్కకుండా అడ్డుకోవడంతోపాటు బస్సులో కూడా వేధింపులకు పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ సిక్కు విద్యార్థితోపాటు గొడవపడుతున్న యువకులను కిలోవ్నా బస్టాప్‌లో దించేశాడు. బస్సు దిగిన తర్వాత ఆ ఇద్దరు విద్యార్థులు సిక్కు విద్యార్థిని కాళ్లతో తంతూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి అక్కడ వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)