ఆసియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విన్ డాని కన్నుమూత

Telugu Lo Computer
0


సియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విన్ డాని మరణించారు. అశ్విన్ డాని తీవ్ర అనారోగ్యంతో ఇవాళ చనిపోయినట్లు ఆసియన్ పెయింట్స్ తెలిపింది. అశ్విన్ డాని 1968 నుంచి కంపెనీతో ప్రస్ధానం కొనసాగించారని, సంస్ధ సాంకేతికంగా అత్యున్నత స్ధాయికి చేరడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పింది ఆసియన్ పెయింట్స్. అశ్విన్ డాని 1970లో కంపెనీ బోర్డులో ఎంటరై 1998 నుంచి 2009 వరకూ వైస్ చైర్మన్‌, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2009 నుంచి ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, వైస్ చైర్మన్‌గా బోర్డులో కొనసాగుతున్నారు. కంపెనీకి ఆయన అందించిన సేవలకు గాను అశ్విన్ డాని ఎప్పటికీ గుర్తుండిపోతారని కంపెనీ ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)