బెంగాల్‌లోని జాదవ్‌పుర్ యూనివర్సిటీలో విద్యార్థి మృతి సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్రో బృందం యూనివర్సిటీని సందర్శించి క్యాంపస్‌లోని భద్రతా చర్యలను పరిశీలించింది. ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందడంతో భద్రతా చర్యలను సూచించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు యూనివర్సిటీ ఛాన్సలర్ సివి ఆనంద్ బోస్ లేఖ రాయడంతో ఇస్రో బృందం బుధవారం ఈ పర్యటన చేశారు. బృందంలోని ఇద్దరు సభ్యులు క్యాంపస్ లోని వివిధ ప్రాంతాలను , భవనాలను సందర్శించారు. అనంతరం వర్సిటీ అధికారులతో భద్రతా సంబంధమైన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బుద్దదేబ్ సౌ మీడియాతో మాట్లాడుతూ.. ' హాస్టల్‌లో ర్యాగింగ్‌ను నివారించే మార్గాలపై కూడా ఇస్రో బృందం చర్చించింది. ఇది డేటా ఆధారిత ప్రాజెక్ట్ కావడంతో ఇస్రో, యూనివర్సిటీ నిపుణులు పాల్గొన్నారు. వారి పరిశీలనల అనంతరం వర్సిటీ అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటుంది. యూనివర్సిటీలో భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి చర్చలు జరుగుతున్నాయని ' ఆయన పేర్కొన్నారు.
జాదవ్‌పుర్ యూనివర్సిటీకి ఇస్రో బృందం
September 07, 2023
0
Tags