ఢిల్లీలో చేరిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ !

Telugu Lo Computer
0


బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇండియాకు విచ్చేశారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి అయ్యాక రిషి సునాక్ మొదటిసారి రావడంతో కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఘనస్వాగతం పలికారు. సునాక్‌ బంధువులు కూడా ఆయన్ని ఆహ్వానించేందుకు భారీగా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రిషి సునాక్‌కు ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఆయన నేరుగా షాంగ్రిలా హోటల్‌కు వెళ్తారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై రుషి సునాక్‌ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన దేశానికి జీ20 సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. యూకే, భారత్ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌లో శనివారం, ఆదివారం జరగనున్న సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని రిషి సునాక్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మొదలు వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం వరకు అన్నింటిలోనూ పాలు పంచుకుంటామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)