స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సంచెజ్‌కు కరోనా

Telugu Lo Computer
0


స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ కొవిడ్ బారిన పడ్డారు. తనకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, దీంతో తాను న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు హాజరు కావడం లేదని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ శుక్రవారం చెప్పారు. తాను కరోనా వల్ల జి20 సదస్సుకు వెళ్లలేనని, ఈ సదస్సులో స్పెయిన్ తాత్కాలిక ఉపాధ్యక్షులు నాడియా కాల్వినో, విదేశాంగశాఖ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని స్పెయిన్ అధ్యక్షుడు చెప్పారు.  చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)