కర్నాటక ప్రభుత్వం మరణించిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఎప్పుడైతే పెంచిందో అప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద పాటిల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శివానంద్ పాటిల్ చేసిన ఈ ప్రకటనపై రైతు సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పాటు రైతు సంఘం కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. శివనంద పాటిల్ మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల నష్టపరిహారం వల్ల రాష్ట్రంలో పెద్దఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. హవేరీ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై వార్తలు రావడం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. మంత్రి ఇంకా మాట్లాడుతూ 2015 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం ప్రారంభించామని, అప్పటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ఈ పరిణామాన్ని మీడియా కూడా పట్టించుకోవాలన్నారు. 2020లో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. 2021లో 600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కానీ, ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే అది మీ వల్లే.. వివిధ కారణాలతో రైతులు ఆత్మహత్యలు ప్రేమ వ్యవహరాల వల్లే మరణాలు కూడా జరుగుతున్నాయని.. రైతు ఆత్మహత్యలతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే నష్టపరిహారంలో జాప్యం జరగదని, ఎమ్మెల్యేలపై సహజంగానే ప్రజల్లో ఒత్తిడి ఉంటుందని, తప్పుడు నివేదికలతో భయాందోళనలు నెలకొంటాయని, రైతు మృతిని ఆత్మహత్యగా భావించవద్దని సూచించారు. మంత్రి చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యలపై కర్నాటకలోని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. బాధ్యతగల పదవిలో ఉన్న ఒక మంత్రి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించేలా వ్యాఖ్యలు చేయాలికానీ..వారిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. పాటిల్ క్షమాపణలు చెప్పేంతవరకు ఆయన ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని హెచ్చరించారు.
కర్నాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు !
September 06, 2023
0
Tags