అరుణాచల్‌ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే !

Telugu Lo Computer
0


రుణాచల్‌ప్రదేశ్‌ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. దీనిపై వెనక్కితగ్గే ప్రసక్తేలేదని ఆయన అన్నారు. హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లకు చైనా వీసా నిరాకరించడంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్‌ చార్టర్‌ ప్రకారం ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం అందులో పాల్గొనే అథ్లెట్లకు కచ్చితంగా వీసా మంజూరు చేయాలన్నారు. కానీ, ప్రస్తుతం ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న చైనా ఉద్దేశ పూర్వకంగానే ఆ ముగ్గురు అథ్లెట్లకు వీసా, అక్రిడిటేషన్‌ నిరాకరించిందని విమర్శించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ అని పిలుస్తున్న డ్రాగన్‌ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన ముగ్గురు అరుణాచల్‌ అథ్లెట్లకు వీసాలు నిరాకరించడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే చైనా ఈ చర్యలకు దిగిందని అధికారికంగా ఫిర్యాదు చేసింది. భారత్‌ అథ్లెట్లపై వివక్ష చూపడం సరికాదన్న అనురాగ్‌ ఠాకూర్‌ తన చైనా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)