బాగ్మతి నదిలో విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా

Telugu Lo Computer
0


బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో బెనియాబాద్ ప్రాంతంలోని పట్టి ఘాట్‌ వద్ద  34 మంది పాఠశాల విద్యార్థులతో భాగ్మతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో పద్నాలుగు మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)