ఉత్తరప్రదేశ్ లోని ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం సాధించిన పార్టీ అభ్యర్ధి సుధాకర్ సింగ్‌ను ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభినందించారు. ఇది విపక్ష ఇండియా కూటమి విజయమని, ఈ విజయ పరంపర రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్‌పీ అభ్యర్ధి 88,000కుపైగా ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్ధి దారా సింగ్ చౌహాన్‌పై 30,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సుధాకర్ సింగ్ గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి విజయంపై అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఘోసీ నియోజకవర్గ ప్రజలు ఎస్‌పీ అభ్యర్ధిని గెలిపించడంతో పాటు ఇండియా కూటమికి పట్టం కట్టారని ట్విట్టర్ వేదికగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 2022 జులైలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పీ నుంచి గెలిచిన దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఘోసీ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇది విపక్ష ఇండియా కూటమి విజయం
September 08, 2023
0
Tags