రాజస్తాన్‌లోని దౌసా జిల్లా హిందౌన్ రోడ్డులో టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓవర్‌టెక్ చేసే సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. టెంపోను ఓవర్ టెక్ చేసే సమయంలో బస్సు ఢీకొట్టిందని సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు బస్సు కిందపడి దుర్మరణం చెందారు. టెంపోలో ప్రయాణిస్తున్న ఆరుగు సైతం గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్‌కు తరలించారు. కరౌలిలోని కైలా దేవి ఆలయాన్ని సందర్శించి టెంపోలో మెహ్వాకు వెళ్తున్న సమయంలో వస్తుండగా మహ్వా-హిందౌన్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. యాత్రికులందరూ కరౌలీలోని హిందౌన్ సిటీ నుంచి మెహ్వాకు టెంపోలో తిరిగి వస్తుండగా రాజస్థాన్ లోక్ పరివాహన్ సేవా బస్సు ఆటో రిక్షాను ఢీకొట్టిందని, దీంతో టెంపో నుజ్జునుజ్జు అయ్యిందని పోలీసులు తెలిపారు.
టెంపోను బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం
September 24, 2023
0
Tags