కేంద్రమంత్రి అమిత్‌షాతో భాజపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆదివారం భాజపా ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కావాల్సినప్పటికీ భేటీ జరగలేదు. ఇంతలో మధ్యాహ్నం మళ్లీ బండి సంజయ్‌తోనే ఆయన సమావేశం కావడంపై భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల భాజపా ఎమ్మెల్యేలు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం వారు హైకమాండ్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్‌షాతో బండి సంజయ్ వరుసగా భేటీ కావడంపై చర్చనీయాంశమైంది.
అమిత్‌షాతో బండి సంజయ్ భేటీ !
September 17, 2023
0
Tags