కేరళలోని తిరువనంతపురానికి చెందిన రెవరెండ్ మనోజ్ కేజీ ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియాలో ఫాదర్‌గా ఉన్నారు. ఆయనకు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. దీంతో ఆయన అయ్యప్ప మాల ధరించారు. శబరిమల వచ్చి స్వామిని దర్శించుకుంటానని తెలిపారు. దీంతో మతపరమైన నియమాలు ఉల్లంఘించారని..ఫాదర్ మనోజ్ పై ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.ఆయన రెవరెండ్ గుర్తింపు కార్డును క్యాన్సిల్ చేసింది. ఆయన నుంచి రెవరెండ్ కార్డును స్వాధీనం చేసుకుంది. అయ్యప్పను దర్శించుకునే భక్తులు మాల ధరించినట్లుగానే ఫాదర్ మనోజ్ కడా అయ్యప్ప మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని సందర్శించుకుంటానని తెలిపారు. సెప్టెంబర్ 20న అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా మనోజ్ 2010లో ఆధ్యాత్మికతవైపుగా పయనించారు. 2015లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మికవేత్తగా మారారు. అలా ఆయన 2022లో రెవరెండ్ స్థానాన్ని పొందారు. జీతం కూడా తీసుకోకుండా బోధనలు చేసేవారు.అప్పటినుంచి క్రైస్తవ బోధనలు చేసేవారు. మనోజ్ కు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దీంట్లో భాగంగానే ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఈక్రమంలో అయ్యప్ప మాల ధరించారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అయ్యప్ప మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక సెప్టెంబర్ 20న శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు. క్రైస్తవ నియమాలను ఉల్లంఘించినందుకు తన బోధనల లైసెన్స్ ను వదులుకున్నారు.
శబరిమల దర్శనం కోసం పదవి వదులుకున్న ఫాదర్
September 11, 2023
0
Tags