గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్‌లో నిర్వహించిన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్' 20వ వార్షికోత్సవంలో మోడీ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీ విశేషాలు తెలుసుకున్నారు. అందులోని ఓ రోబో ఓ ట్రేలో స్నాక్స్, టీ కప్పుతో మోడీ దగ్గరికి వచ్చి ఆయనకు అందించింది. ఈ వీడియోను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్యాలరీలోని రోబోలను, వాటి పనులనుమోడీ ఆసక్తికరంగా తెలుసుకుంటూ ఫొటోలో తీసుకున్నారు. డీఆర్డీఓ తయారు చేసిన మైక్రోబోట్స్, అగ్రికల్చర్ రోబో, మెడికల్ రోబో, స్పేస్ రోబో వంటివాటిని ప్రదర్శనలో ఉంచారు. తను 2003లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తొలి వైబ్రంట్ గుజరాత్ సదస్సు జరిగిందటూ ఆ రోజులను మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు కేంద్ర మంత్రులెవరూ ఆ కార్యక్రమానికి రాలేదని, తను అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే వారు రాజకీయాలు చేశారని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు. కాగా అహ్మదాబాద్‌లో నిర్మించిన అక్వాటిక్ గ్యాలరీని కూడా మోడీ సందర్శించారు. ఇందులో అరుదైన షార్క్ చేపలను ప్రదర్శిస్తున్నారు.
మోడీకి చాయ్ ఇచ్చిన రోబో !
September 27, 2023
0
Tags