మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సుఖీ సేవనియా ప్రాంతంలో జరిగిందీ దారుణం. సమాచారం మేరకు బాధితుడైన రాంస్వరూప్ అహిర్వార్ దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. చౌపడకలాన్ గ్రామపంచాయతీలో కొత్వార్ (వాచ్‌మెన్)గా పనిచేస్తున్నాడు. బాధితుడు ఈ దారుణానికి సంబంధించిన వివరాలను పోలీసులకు వివరించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 10న ఈ ఘటన జరిగింది. భోపాల్‌లోని ఓ గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న రౌడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. గ్రామ పెద్ద భర్త షేరు మీనాతో పాటు కొందరు రౌడీలు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రౌడీలను అడ్డుకోవడంతో దాడికి పాల్పడ్డారని తెలిపాడు. నిందితులు తనను తమ కారులో బలవంతంగా తీసుకెళ్లి నిర్జన ప్రాంతంలో దారుణంగా కొట్టారని, అపస్మారక స్థితిలో ఉన్న తనపై మూత్రం పోసి లేపి మరీ కొట్టారని పేర్కొన్నాడు. కొట్టడం, మూత్రవిసర్జన సంఘటన తర్వాత, నిందితులు రామ్ స్వరూప్‌ను షేరు మీనా ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారట. నిందితుల్లో ఉన్న షేరు మీనా అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మకు సన్నిహితుడు. మరోవైపు, ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రమోద్ కుమార్ సిన్హా తెలిపారు. ఏడుగురు నిందితులలో ఐదుగురిని అరెస్టు చేశామని, మిగతావారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.
మధ్యప్రదేశ్ అమానవీయ ఘటన !
September 13, 2023
0
Tags