జీ-20 సమావేశాలకు 'ప్రెసిడెంట్ ఆప్ భారత్' పేరిట రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వడంతో తాజాగా రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్ అని ముద్రించింది. ఈ సదస్సుకు నాయకత్వం వహించడాన్ని గుర్తు చేస్తూ 'భారత్, ద మదర్ ఆఫ్ డెమోక్రసీ'గా పేర్కొంది. ఇక్కడ వేల ఏళ్ల నుంచి ప్రజాస్వామ్య విలువలు నెలకొన్నట్లు తెలిపింది. రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, దీని కోసం తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ఆగస్టులోనే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ సమావేశ నోటిఫికేషన్‌లో కూడా 'ఇండియా' స్థానంలో 'భారత్' పేరును వినియోగించారు. 'ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని ప్రస్తావించారు. ఆ తర్వాత గ్రీస్ పర్యటనలో కూడా ఇలానే వాడారు. ఆగస్టు 22-25 మధ్యలో ఆ రెండు దేశాల్లో ప్రధాని పర్యటనకు సంబంధించిన నోటిఫికేషన్‌లో ఈ విషయం స్పష్టంగా ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే తూర్పు ఆసియా సదస్సు, ఇండోనేషియాలో ఏషియన్ ఇండియా సదస్సుల నోటీసుల్లో కూడా 'ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అనే వినియోగించారు. ఈ సదస్సులు నేటి నుంచి జరగనున్నాయి.
బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే 'భారత్' ప్రస్తావన !
September 06, 2023
0
Tags