మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ ' ప్రాజెక్ట్ నమన్' ను ప్రారంభించింది. మాజీ సైనికులు, సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనీలో భాగంగా మొదటిగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో కేంద్రం ఏర్పాటు చేయనున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు. భారత సైన్యానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఆర్మీ వెటర్నన్స్, హెడ్ డీ ఎప్ సీ బ్యాంకు లిమిటెడ్, సిఎస్ఇఇ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ దీని కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని సంతకం చేశాయి. దీంట్లో సైనిక కుటుంబాలకు సౌకర్యాలు కల్పించడానికి ఒక కామన్ సర్వీసు సెంటర్ ఉంటుంది. అలాగే ఈ సెంటర్ అన్ని ప్రభుత్వ కస్టమర్ సేవలను అందిస్తుంది. దాంట్లో సైనికులు కుటుంబాల పెన్షనర్ల ఎకౌంట్స్ కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రాజోక్టు రెండో దశంలో దేశవ్యాప్తంగా వివిధ సైనిక స్టేషన్లలలో మరో 13 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
మాజీ సైనికులు,అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం 'ప్రాజెక్ట్ నమన్'
September 06, 2023
0
Tags