బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన లియర్‌జెట్ 45 విమానానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే 27పై ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా రన్‌వే నుంచి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ల్యాండింగ్ సమయంలో విమానంలో మొత్తం ఎనిమిది మంది (ఇద్దరు సిబ్బందిసహా) ఉన్నారని సమాచారం. వాళ్లలో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి విమానం ముంబైకి చేరుకున్న క్రమంలోనే ప్రమాదానికి గురైనట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై ప్రమాదానికి గురైన విమానం
September 14, 2023
0
Tags