ఢిల్లీలోని జకీర్ నగర్‌లో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మాటల్లో చెప్పరాని ఘోరానికి తెగబడి హతమారిపోయాడు. అతని చేతిలో నరకం అనుభవించిన బాలుడు పేపర్ చాక్‌తో గొంతు కోసి చంపేశాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరించారు. మహమ్మద్ వసీం అనే 28 ఏళ్ల హోం ట్యూటర్ బాధిత బాలుడిపై కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. వీడియోలు తీసి బెదిరించి మరీ ఘోరానికి పాల్పడుతున్నాడు. భరించలేని బాలుడు పక్కా పథకం వేశాడు. గత నెల 30న వసీం బాలుడిని తన ఇంటికి రావాలని బెదిరించాడు. సరే సార్ అంటూ బాలుడు పుస్తకంలో పేపర్ చాక్ పెట్టుకుని వెళ్లాడు. వసీం తనపై లైంగిక దాడి చేస్తుండగా కత్తి తీసి గొంతు కోసి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను బలాత్కరించడం వల్లే చంపేశానని బాలుడు ఒప్పుకున్నాడు.
హోం ట్యూటర్ ను గొంతు కోసి హతమార్చిన బాలుడు !
September 03, 2023
0
Tags