స్పెయిన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీదీ తెల్ల చీరను ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ దానికి క్యాప్షన్ కూడా జోడించారు. ''ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వ్యాయామం మీకు శక్తినిస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి'' అని రాసుకొచ్చారు. మమతా బెనర్జీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ.. ఆయా సందర్భాల్లో అవగాహన కల్పించారు. గతంలో ఆమె డార్జిలింగ్ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 12 రోజుల పాటు దుబాయ్, స్పెయిన్ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటైన ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
మాడ్రిడ్‌లో మమతా బెనర్జీ జాగింగ్ !
September 14, 2023
0
Tags