ఎక్స్(x)లో టాప్ పొజీషన్ లో ఉన్న ఓ వ్యక్తి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. భారత్, దక్షిణాసియా పాలసీ హెడ్ గా ఉన్న సమీరన్ గుప్తా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సందేహాల్ని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 2022లో ఎక్స్ లో చేరిన ఆయన కంటెంట్ సంబంధిత విధాన సమస్యలు, న్యూ పాలసీలు, కంపెనీ సంబంధాలు బలపర్చడం తదితర బాధ్యతలను ఆయన నిర్వహించేవారు. గవర్నమెంటుకు, పొలిటికల్ పార్టీలకు మధ్య అనుసంధానకర్తగా ఉంటూ హెడ్ గా పని చేసేవారు. ఎక్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంచిన కొంత కంటెంట్ తో పాటు మరో కేటగిరీకి చెందిన కంటెంట్ ని తీసేయాలని గతంలో కేంద్రం ఎక్స్ ని ఆదేశించింది. ఆ ఆదేశాలు పాటించడంలో ఎక్స్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇలాంటి కంటెంట్ ఎన్నికల సమయంలో మరింతగా వ్యాపిస్తుందని అంచనా వేసిన సమీరన్ ఆ తలనొప్పి ఎందుకు అనుకున్నారేమో ఏకంగా అంత పెద్ద పదవిని సునాయాసంగా వదిలేశారు.
ఎక్స్‌కు సమీరన్ గుప్తా రాజీనామా !
September 23, 2023
0
Tags