పాత భవనం కూలి ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని భివాండిలో రెండంతస్ధుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా నలుగురికి గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 45 ఏండ్ల కిందటి భవనం కూలడంతో దానిలో నివసిస్తున్న వారు భవనం శిధిలాల కింద చిక్కుకున్నారు. భివాండి అగ్నిమాపక దళం, ఇతర బృందాలు జాయింట్ ఆపరేష్ చేపట్టి బాధితులను కాపాడారు. వీరిలో నలుగురిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా, ఇద్దరు మరణించారు. మృతలను ఉజ్మా (40), ఎనిమిది నెలల చిన్నారిగా గుర్తించారు. నాలుగు దశాబ్ధాలకుపైగా నిలిచిన ఈ కట్టడం ప్రస్తుతం శిధిలావస్ధకు చేరింది. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని స్ధానిక మున్సిపల్‌ కార్పొరేషన్ నివాసితులకు నోటీస్ జారీ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు చెబుతున్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే భివాండి ఫైర్ స్టేషన్ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. సహాయ, పునరావస చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)