రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సోషల్‌మీడియాను దుర్వినియోగపాలు చేస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియా గురించి తెలియని వారే లేరు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ సోషల్‌మీడియా గురించి తెలుసా. ఎలా వాడాలో తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజూ కూడా సోషల్‌మీడియాను వినియోగించకుండా ఉండలేని పరిస్థితి నేటికీ నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా చాలామంది యువత నిత్యం ఫేస్‌బుక్, వాట్సాఫ్‌లంటూ గంటల తరబడి సమయం కేటాయిస్తున్నారు. కొందరైతే ఉదయం లేచిన దగ్గరనుంచి అర్థరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. ఈ సోషల్ మీడియాల్లో ట్విట్టరు, ఇన్‌స్టాగ్రామ్, యూటూబ్ వీటిల్లోనే నేటి యువత ఎక్కువగా మునిగితేలుతున్నారు. అయితే, కొందరు ఈ సామాజిక మాధ్యమాలని ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందోనే అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వీటిలో ఫేక్‌న్యూస్‌లు కూడా అప్పుడప్పుడు మనకు దర్శనమిస్తుంటాయి. వాటి గురించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకొనే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. సరికదా. చూసిన వాటినే నిజమని నమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్రికరిపూర్‌లో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభానికి పినరయ్ విజయన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అందుకు కారణం.. ఇరవై ఆరేళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సిపిఎం పార్టీకి చెందిన సీనియర్ నేతల కుటుంబంలోని మహిళలను సోషల్‌మీడియాలో తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అసభ్యకరమైన ఫోటోలను షేర్ చేస్తున్నాడు. ఆ కార్యకర్త తిరువనంతపురంలోని పరశాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే, కొంతమంది రాజకీయ కక్షతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని కేరళ సిఎం విరుచుకుపడ్డారు. ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించేటప్పు నాగరికతను కోల్పోకూడదని హితబోధ చేశారు. ఇతరులను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మన చర్యలు ఉండకూడదంటూ సూచించారు. ప్రత్యర్థులను లక్ష్యంగా పెట్టుకుని కొంతమంది నేతలు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ, మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. సోషల్‌మీడియాను దుర్వినియోగం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకపోవడం వల్ల ఇలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఇలాంటి చర్యలను సహించకూడదని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు !
September 24, 2023
0
Tags