గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్‌పై బాలికలకు బోధించిన ఉపాధ్యాయురాలు !

Telugu Lo Computer
0


బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న క్రమంలో స్కూల్ టీచర్ బాలికలకు గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తున్న వీడియో  సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఐపీఎస్ అధికారి ఆర్. స్టాలిన్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లను ఈ క్లిప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోలో టీచర్ స్కూల్ బాలికను ఈ కీలక టాపిక్‌పై అవగాహన కల్పిస్తుండటం కనిపిస్తుంది. ఈ ఫుటేజ్‌లో ఏది సరైన స్పర్శ ఏది చెడు ఉద్దేశంతో కూడుకున్నదో సదరు టీచర్ బాలికకు వివరిస్తుంది. లైంగిక వేధింపులు, ముప్పు నుంచి ఇలాంటి శిక్షణ బాలికలు తమను తాము కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగత హద్దులు, భద్రతపై చిన్నారులకు ఇలాంటి శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు నెటిజన్లు ఉపాధ్యాయురాలి చొరవను ప్రశంసించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)