బంగ్లాదేశ్‌ నుండి మళ్లీ 'పద్మా పులస' !

Telugu Lo Computer
0


తేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా (హిల్సా) పద్మా పులసను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లలో హిల్సాను వండుకొని తింటారు. ఈ నేపథ్యంలో దాదాపు 4వేల మెట్రిక్‌ టన్నుల పద్మాపులసలను భారత్‌లో విక్రయించడానికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా దేవీ నవరాత్రులు రానున్న నేపథ్యంలో హిల్సా చేపలను భారత్‌కు కానుకగా పంపిస్తోంది. ఈ సందర్భంగా చేపల దిగుమతిదారుల అసోసియేషన్‌ కార్యదర్శి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..' బంగ్లాదేశ్‌ దేవీ నవరాత్రుల సందర్భంగా బెంగాలీలకు ఇష్టమైన పద్మా పులసను అందించడం గొప్ప వార్త. వారు ఎగుమతి చేసే చేపలను తీసుకురావడానికి 40 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఆ సమయాన్ని మరింత పెంచితే బాగుంటుందని' ఆయన తెలిపారు. బెంగాల్‌లో గురువారం నుంచి పద్మా పులస రాక ప్రారంభమైంది. సాధారణంగా కోల్‌కతా మార్కెట్లలో కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. కొంత మంది బెంగాల్‌ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా సమర్పిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)