మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడు తన రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. 2016 లో ఆ వ్యక్తి స్వీయ రక్షణ కోసం రివాల్వర్ తీసుకున్నాడు. పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం అందటంతో అక్కడి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి వద్ద నుంచి ఓ ఏడు పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న అంశాలు పోలీసులను విస్తుపోయేలా చేశాయి. ‘నేను ఎనిమిది, తొమ్మిదేళ్ల ముందే 30 ఏళ్ల వరకే బతకాలనుకున్నాను. ఇప్పుడు నాకు ముప్పై ఏళ్లు వచ్చేశాయి. అందుకే చనిపోతున్నాను. నాకు ఎలాంటి కష్టాలు, బాధలు లేవు. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని ఆ సూసైడ్ నోట్ లో రాసి ఉంది. అయితే ఆ వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు నిజంగానే 30 ఏళ్ల వరకు బతికి చనిపోవాలనుకున్నాడా? లేదా అతని ఆత్మహత్య వెనుక మారేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.
30 ఏళ్ల వరకే బతకాలనుకున్నాను !
September 08, 2023
0
Tags