ఆరోగ్య కారణాల రీత్యా జీ20 విందుకు దేవగౌడ దూరం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఈనెల 9-10 తేదీల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకాబోతున్నారు. కాగా, జీ20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ విందుకు మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు సహా పలు పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్‌, హెచ్‌డీ దేవగౌడలకు కూడా ఆహ్వానం అందింది. అయితే, ఈ విందుకు దేవగౌడ దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. 'జీ20 సమ్మిట్‌ సందర్భంగా 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముజీ ఏర్పాటు చేసిన విందుకు నేను హాజరుకావడం లేదు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ విందుకు రావడం లేదని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశాను. జీ20 సదస్సు గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)