ఢిల్లీ మెట్రో లేడీస్ కోచ్ ఎక్కిన వ్యక్తితో మహిళలు వాగ్వాదం !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రో లేడీస్ కోచ్‌లోకి ఓ వ్యక్తి ఎక్కడంతో  ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రోలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజా వీడియో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మధ్య మాటల యుద్ధాన్ని చూపించింది. ట్విట్టర్ యూజర్ @gharkekalesh షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి లేడీస్ కోచ్‌లోకి ఎక్కాడు. ఈ విషయాన్ని ఓ మహిళా ప్రయాణికురాలు ప్రశ్నిస్తూ అతనిని వీడియో తీసింది. తాను మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని ఆ వ్యక్తి చెప్పే ప్రయత్నం చేశాడు. అతని వెంట ఉన్న మరో మహిళ వీడియో తీస్తున్న మహిళను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఓ దశలో వీరి మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇదంతా గమనిస్తున్న మరో మహిళ లేడీస్ కోచ్‌లోకి ఎలా ఎక్కుతారని ప్రశ్నించింది. తరువాత స్టేషన్‌లో దిగమని సలహా ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ' మెట్రో ఫైటింగ్‌లకు మంచి ప్లేస్‌గా మారిందని కొందరు, ఢిల్లీ మెట్రోలో ఏదైనా సాధ్యమని' ట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)