పొరపాటున కుండ్ జలపాతం లోకి దూసుకెళ్లిన కారు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్లోని లోధియా కుండ్ జలపాతం చూడడానికి ఓ కుటుంబం కారులో వెళ్లింది. అయితే కారును జలపాతం సమీపంలో పార్క్ చేసి వెళ్లగా లోపల 12 ఏళ్ల బాలిక కూర్చోని ఉంది. కాసేపటికే కారు జలపాతంలోకి దూసుకెళ్లింది. హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాలిక గేర్ రాడ్ను కదిలించగా అది ముందుకు దూసుకెళ్లి జలపాతంలో పడిపోయినట్లు సమాచారం. వెంటనే బాలిక తండ్రి సహా స్థానికులు నీటిలోకి దూకి కారు డోర్ తెరిచి చిన్నారిని కాపాడారు. ఈ ఘటనలో తండ్రి, కూతురిగా స్వల్ప గాయలవ్వగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను కొందరు పర్యాటకులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో..అది వైరల్గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)