ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం !

Telugu Lo Computer
0


దివారం ఉదయం ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా గ్రాఫిటీ (రంగులతో స్ప్రే చేయడం)తో రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ పేరుతో ఖలిస్థాన్‌కు మద్దతుగా దిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్‌ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న పలు స్టేషన్లలో రాశారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్‌కు మద్దతుగా రాతలు కలకలం రేపాయి. గతంలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడాలో నివసిస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)