ప్రాణం తీసిన యూట్యూబ్ డెలివరీ !

Telugu Lo Computer
0


మిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో యూట్యూబ్‌ చూసిన వ్యక్తి ఆ విధంగా భార్యకు డెలివరీ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది బెడిసికొట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ మరణించింది. పులియంపట్టికి చెందిన 27 ఏండ్ల లోకనాయకి నిండు గర్భిణీ. ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే భర్త మాధేష్ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. పైగా ఇంటి వద్దనే సహజ కాన్పు చేసేందుకు యత్నించాడు. యూట్యూబ్‌లో చూసిన విధంగా డెలివరీ చేసేందుకు ప్రయత్నించాడు. బొడ్డు తాడును సరిగ్గా కోయకపోవడంతో ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ మహిళను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారిణి రాధిక దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్య డెలివరీకి ప్రయత్నించి ఆమె మరణానికి కారణమైన భర్త మాధేష్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)