గ్రీస్ చేరుకున్న నరేంద్ర మోడీ

Telugu Lo Computer
0


భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం గ్రీస్‌ చేరుకున్నారు. అయితే ఈ పర్యటనకు ఒక ప్రాముఖ్యత ఉంది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మధ్యధరా ద్వీపానికి భారత ప్రధాని వెళ్లారు. గ్రీస్‌లో ప్రధాని మోడీ కీలక చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, షిప్పింగ్ వంటి విభిన్న అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటీకరించడంలో భారతదేశ సహాయాన్ని పొందాలని గ్రీస్ భావిస్తోంది. దీంతో ఐరోపాలోకి ఇండియా అడుగు పెట్టేందుకు గ్రీస్‌ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగపడనుంది. గ్రీస్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ ఈ పర్యటన చారిత్రక ప్రాముఖ్యతను వెల్లడించారు. ప్రధాని మోదీ, గ్రీస్ అగ్ర నాయకత్వం మధ్య జరగనున్న తదుపరి సమావేశాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పీపుల్‌-టూ-పీపుల్‌ ఎంగేజ్‌మెంట్‌, సెక్యూరిటీపై ప్రధాన దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలలో గ్రీస్‌కు భారత ప్రధాని చేసిన తొలి పర్యటన ఇదే. 1983లో గ్రీస్‌ను సందర్శించిన చివరి ఇండియన్ పీఎం ఇందిరా గాంధీ. ప్రస్తుత పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల పునరుజ్జీవనానికి నిదర్శనం. 2021లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గ్రీస్ పర్యటన తర్వాత ఈ ప్రక్రియ ఊపందుకుంది. జైశంకర్ పర్యటనలో మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌ అగ్రిమెంట్‌పై గ్రీస్ భారతదేశానికి మద్దతు ఇచ్చింది. అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)