మణిపూర్ రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు చేసినప్పటికీ సోమవారం అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించలేదని అధికారులు తెలిపారు. రాజ్‌భవన్ అనుమతించకపోవడంతో సెషన్ జరగలేదని అన్నారు. సాధారణంగా అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించాలంటే సమావేశాల ప్రారంభానికి 15 రోజుల ముందు రాజ్‌భవన్ అధికార ప్రకటన జారీచేయాల్సి వుంటుంది. అయితే గవర్నర్ అనసూయీ ఉకేయి కార్యాలయం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నందున అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేమని పది మంది కుకీ ఎమ్మెల్యేలు ప్రకటించిన మరుసటి రోజు మంత్రి మండలి గవర్నర్‌కి సిఫారసు చేయడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మణిపూర్ అసెంబ్లీ 4వ సెషన్‌ను ఈ నెల 21 నుండి నిర్వహించాలని మణిపూర్ గవర్నర్‌ని రాష్ట్ర కేబినెట్ కోరినట్లు ఆగస్ట్ 4న ఓ ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే మరుసటి సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. దీంతో సెప్టెంబర్ 2కి ముందు అసెంబ్లీ సెషన్ నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఉందని ఆ ప్రకటనలో తెలిపింది.
మణిపూర్ అసెంబ్లీ సెషన్‌కు అనుమతించని రాజ్‌భవన్
August 21, 2023
0
Tags