ప్రజ్ఞాన్‌ రోవర్‌ రూటు మార్చిన ఇస్రో !

Telugu Lo Computer
0


చంద్రయాన్‌-3కి చెందిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ వెళ్తున్న దారిలో భారీ అగాధం ఎదురైంది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు నాలుగు మీటర్ల విస్తీర్ణం ఉన్న గొయ్యిని గుర్తించారు. దీంతో ప్రజ్ఞాన్‌ రోవర్‌ రూటును మార్చారు. రోవర్‌కు ఉన్న నావిగేషన్‌ కెమెరాలు ఆగస్టు 27వ తేదీన ఆ క్రాటర్‌ ఫోటోను తీశాయి. ఆ ఫోటోను ఇవాళ ఇస్రో తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ గొయ్యి రోవర్‌ ప్రజ్ఞాన్‌కు సుమారు మూడు మీటర్ల దూరంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మళ్లీ రోవర్‌ను వెనక్కి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఆ రోవర్‌ కొత్త రూట్లో సురక్షితంగా వెళ్తున్నట్లు ఇస్రో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)