కొచ్చి - బెంగళూరు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు !

Telugu Lo Computer
0


కొచ్చి నుంచి బెంగళూరుకి 6E6482 అనే ఇండిగో విమానం సోమవారం ఉదయం బయలుదేరింది. కొచ్చి విమానా శ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవడమే ఆలస్యం అధికారులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ విమానంలో బాంబు ఉందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించారు. విమానంలో ఉన్న ప్రయాణికుల్ని వెంటనే దింపేసి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానంలో ఒక చిన్నారి సహా మొత్తం 138 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. కేరళ రాష్ట్ర పోలీసులు, బాంబు స్క్వాడ్‌తో పాటు భద్రతా విభాగాలు రంగంలోకి దిగాయి. అటు విమానంలో, ఇటు బ్యాగేజీలను గంటసేపటి వరకు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో.. తమకు వచ్చింది ఫేక్ ఇంటర్నెట్ కాల్ అని ధృవీకరించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి, ఫేక్ కాల్ చేసిందెవరో కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. ఆగస్టు 18వ తేదీ కూడా ఇలాంటి సంఘటనే ఢిల్లీలోనూ చోటు చేసుకుంది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. తనిఖీల కోసం 8 గంటల పాటు విస్తారా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ను ఆపేశారు. ఫైనల్‌గా అనుమానాస్పదంగా ఏమీ దొరక్కపోవడంతో.. ఆ విమాన సేవల్ని పునరుద్ధరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)