ఢిల్లీ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు బాలురిని సహ విద్యార్థులు లైంగిక వేధింపులకు గురిచేసిన అంశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు పాఠశాల వైస్ ప్రిన్సిపల్, టీచర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించినందున వారిపై సస్పెన్షన్ విధించాలని విద్యాశాఖ డైరెక్టరేట్‌కు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై సహ విద్యార్థులు లైంగిక వేధింపులకు గురిచేశారు. నాలుగు నెలల క్రితమే జరిగిన ఈ ఘటన గురించి బాధిత విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు మాత్రం పోలీసులకు తెలపలేదు సరికదా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులను మళ్లీ వేధించడం ప్రారంభించారు. ఈ సంగతి గురించి ఎవరికీ చెప్పకూడదంటూ.. బెదిరించారు. వేధింపులు తాళలేని వారు తమ తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాలురిపై లైంగిక వేధింపులు అంశంపై రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వైస్ ప్రిన్సిపల్, టీచర్లను తక్షణమే సస్పెన్షన్ విధించాలని విద్యాశాఖ డైరెక్టరేట్‌కు ఆదేశాలు జారీ చేశారు.
బాలురిపై లైంగిక వేధింపుల అంశంలో వైస్ ప్రిన్సిపల్, టీచర్లపై సీఎం ఆగ్రహం
August 29, 2023
0
Tags