రాగి జావ - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ప్రతిరోజూ ఉదయమే రాగి జావ తీసుకోవడం చాలా మంచింది. ఇది తాగడం వల్ల ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు ఎముకలు కూడా బలంగా మారుతాయి. అందుకోసమే రాగి జావ తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అలాగే ఇది ఓ మంచి అల్పాహారం కూడా. అంతేకాదు వీటిలో పాలు కలిపి తీసుకుంటే మరింత పోషకంగా మారుతుంది. కాల్షియానికి మూలం పాలు. ముఖ్యంగా ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో దీని పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాదు అధికంగా బరువు ఉంటే తగ్గించుకోవడానికి కూడా ఈ రాగిజావ తోడ్పడుతుంది. అంతేకాదు ముఖ్యంగా బాలింతలు కూడా ఈ రాగిజావ తాగడం ఎంతో మంచింది. ఎందుకంటే బాలింతలు కూడా ఈ రాగిజావ తాగితే వారి చనుబాలును పెంచుతుంది. చనుబాలు సరిగ్గా రాక ఇబ్బందులు పడే బాలింతలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. రాగి పిండి- 2 టేబుల్ స్పున్లు, 250 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. అలాగే బెల్లం – రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి అవసరం మేరకు తీసుకోవాలి. ముందుగా పాలు తీసుకొని స్టవ్‌పై వేడిచేయాలి. అది వేడి అయ్యాక అందులో రాగిపిండి వేయాలి. అలాగే ఆ పిండి ముద్దలు కాకుండా ఉండేందుకు తరచుగా కలుపుతూ ఉండాలి. ఇంకా అవసరమైతే కొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. పిండి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో బెల్లం వేయాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేయాలి. ఇలా చేస్తే రాగిజావ తయారైనట్లై. అయితే దీన్ని అలా వేడివేడిగానే తాగకూడదు. కొద్దిగా చల్లబరిచాక తీసుకోవాలి. ఇలా రాగిజావ ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది తాగితే అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)