రాహుల్ గాంధీతో పెళ్లికి రెడీ : షెర్లిన్ చోప్రా

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించి కొంత కాలంగా పలు వార్తలు బయటకు వస్తున్నాయి. జోడో యాత్ర సమయంలోనే రాహుల్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానంటూ  తన భార్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వివరించారు. కొద్ది రోజుల క్రితం హర్యానాకు చెందిన కొందరు మహిళలు సోనియా నివాసానికి వచ్చారు. ఆ సమయంలోనూ సోనియాతో రాహుల్ పెళ్లి గురించి ప్రస్తావన చేసారు. దీంతో, మంచి సంబంధం చూడాలని సోనియా వారితో పేర్కొనటం వైరల్ గా మారింది. ఇప్పుడు రాహుల్ తో పెళ్లికి సంబంధించి నటి షెర్లిన్ చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా షెర్లిన్‌ చోప్రా ను రాహుల్ ను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే ఓకే చెప్పేశారు. ఎందుకు చేసుకోకూడదని ప్రశ్నించారు. అదే సమయంలో ఒక కండీషన్ పెట్టారు. పెళ్లి తరువాత కూడా తన ఇంటి పేరు చోప్రాగానే ఉండాలంటూ షరతు విధించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు సంబంధించి పలు పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతు దారులు షర్లిన్ వ్యాఖ్యల పైన ట్రోల్ చేస్తున్నారు. షర్లిన్ ను పెళ్లి చేసుకొని రాహుల్ తన జీవితాన్ని వృధా చేసుకోరంటూ కామెంట్స్ నెట్టింట దర్శనమిస్తున్నాయి. వివాదాస్పద కామెంట్స్.. ట్రోలింగ్ షెర్లిన్ కు కొత్త కాదు. గతంలోనూ బిగ్ బాస్ వ్యవహారంలోనూ షెర్లిన్ వివాదాస్పదంగా మారారు. ఇప్పుడు రాహుల్ గాంధీతో పెళ్లి గురించి కామెంట్స్ చేయటంతో రాజకీయంగానూ షెర్లిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)