బాలుడిపై ఆకతాయిల దాడి !

Telugu Lo Computer
0


ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్లో ముస్లిం యువకుడు ఓ హిందూ అమ్మాయితో కనిపించాడు. వీరిద్దరు రైల్వే స్టేషన్ లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ సమయంలో 10 మంది యువకులు జై శ్రీరామ్, వందేమాతరం నినాదాలు చేస్తూ ముస్లిం యువకుడిని కొట్టడం ప్రారంభించారు. అతని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. యువకుడిని కొట్టడం ఆపాలంటూ బురఖా ధరించిన ఒక బాలిక వేడుకుంది. అయినా కూడా యువకులు దాడి చేయడం ఆపలేదు. ఈ ఘటన జులై 21వ జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలో బాధితులు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మైనర్లే. ఈ ఘటనపై ఎఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్, సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే రయీజ్ షేక్ స్పందించారు. ఎవరైనా తప్పు చేస్తే దానికి చట్టం ఉందని, అయితే ఒకరిని అలా కొట్టే హక్కు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అంబర్ నాథ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అబ్బాయి, అమ్మాయి ఇద్దరికి ఒకరినొకరు తెలుసు అని చెప్పారు. దీనిపై బాలుడుపై కేసు నమోదు చేశామని..అతడు ప్రస్తుతం జువైనల్ కోర్టులో హాజరపర్చామని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)